Thursday, December 19, 2024

మొహర్రం వేడుకలకు అధికారులకు మంత్రి కొప్పుల సూచన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : మొహర్రం వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు. మొహర్రం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి మహమూద్ అలీతో కలిసి కొప్పుల ఈశ్వర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మొహర్రం వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతీ పండుగను ప్రభుత్వ పరంగా భక్తి భావంతో జరుపుకునే విధంగా సహకరిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు అహ్మద్ బాషా ఖాద్రి, ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మొహమ్మద్ మసిఉల్లా ఖాన్, హజ్ కమిటీ చైర్మన్ మొహమ్మద్ సలీం, మైనారిటీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్‌నదీం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన ఎండి కాంతి వెస్లి, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News