Wednesday, January 22, 2025

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

నల్గొండ : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు నల్గొండ ఎ మ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్‌లో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని కే కులు కట్ చేశారు. ఆనంతరం స్థానిక ఎమ్మెల్యే భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. క్రైస్తవ మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ కే అపూర్వరావ్, అడిషనల్ ఎస్పీ ప్రసాద్ రావు మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ య్య యాదవ్, తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ , నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడగౌడ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, బిఆర్‌ఎస్ రాష్ట్ర మైనార్టీ నాయకులు అనీఫ్ ముక్తదీర్, స్థానిక కౌన్సిలర్లు నాయకులు, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News