Wednesday, January 22, 2025

మోడీ బాటలో కేంద్ర మంత్రులు

- Advertisement -
- Advertisement -

వికసిత భారత్ నిర్మాణం కోసం పటిష్టమైన చర్యలను చేపట్టేందుకు బిజెపి సాగిస్తున్న ప్రచారానికి తన వంతు సాయంగా ప్రధాని నరేంద్ర మోడీ రూ. 2,000 విరాళాన్ని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రులతోసహా పలువురు బిజెపి నాయకులు సోమవారం పార్టీకి విరాళాలను ప్రకటించారు. మరి కొద్ది రోజులలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ఎస్ జైశంకర్, స్మృతి ఇరానీ తదితరులు పార్టీకి విరాళాలను అందచేశారు. బిజెపి నిధికి రూ. 2,000 అందచేసిన రాజ్‌నాథ్ సింగ్ ఆందుకు సంబంధించిన రసీదును ఎక్స్‌లో షేర్ చేశారు. దేశ నిర్మాణానికి విరాళాలు అందచేయవలసిందిగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

జైశంకర్ కూడా రూ. 2,000 విరాళాన్ని పార్టీ నిధికి అందచేశారు. స్మృతి ఇరానీ రూ. 1,000 పార్టీ నిధికి విరాళంగా అందచేశారు. బిజెపికి మద్దతుగా విరాళాన్ని అందచేసినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని స్మృతి ఇరానీ ఎక్స్ వేదికగా తెలిపారు. వికసిత భారత్ నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోడీ కంటున్న కలలను నిజం చేయడానికి మనమంతా కృషి చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. యమోయాప్ ద్వారా డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్ ప్రచారంలో తనతోపాటు పాల్గొనాలని ఆమె కోరారు. మరో కేంద్ర మంత్రి అమిత్ షా బిజెపి నిధికి రూ. 2,000 విరాళాన్ని ప్రకటించగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పార్టీకి రూ. 1,000 విరాళంగా ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News