మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని.. అల్లా దయతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి పేర్కోన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ముస్లీం సోదర, సోదరీమణులకు ఈద్ ఉల్ అధా (బక్రీద్) పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
త్యాగం, సహసం, బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ జరుపుకుంటురన్నారు. భక్తి భావం విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధ్దలతో ఘనంగా జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలాషించారు.
తొలి ఏకదశి పర్వదిన శుభాకాంక్షలు.. రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మంత్రి సత్యవతి పేర్కోన్నారు. ఏడాది పొడువునా తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపే పండుగలకు తొలి ఏకదశఙ ఆది పండుగ అని మంత్రి పేర్కోంటూ రాష్ట్ర ప్రజలకు శుభాలను, ఆయురారోగ్యాలను అందించాలని మంత్రి భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు పేర్కోన్నారు.