Friday, December 20, 2024

డయాలసిస్ సెంటర్లు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దేవుడు ఇచ్చిన వరం : మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : డయాలసిస్ కేంద్రాల పనితీరు లో దేశంలో మార్గదర్శకంగా నిలబడ్డామని మంత్రి హరీష్ రావు అన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ప్రభుత్వ పత్రిలో డయాలసిస్ సెంటర్ ను మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు 5 పడకల డయాలసిస్ ఏర్పాటు చేశామని తెలిపారు. డయాలసిస్ కేంద్రాల పనితీరు లో దేశంలో మార్గదర్శంగా నిలబడ్డామని, రక్తాన్ని శుద్ధి చేసే చికిత్స లో తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణ పర్యటకు వచ్చి తెలంగాణ ప్రభుత్వం కిడ్నీ వ్యాదిగ్రస్తులకు ఇస్తున్న చికిత్స చూసి తెలంగాణ తరహా లోనే తమిళనాడు లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బస్ పాస్ లు, ఆసరా పెన్షన్లు దేశంలో ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంమని పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందుకు మూడు డయాలసిస్ కేంద్రాలను 102 కు పెంచామని తెలిపారు. ఒక సంవత్సరానికి ఒక డయాలసిస్ సెంటర్ నిర్వహణకు వందకోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని అన్నారు. క్యాన్సర్ పేషంట్ల కోసం పాలియేటివ్ కేంద్రాన్ని కూడా చౌటుప్పల్లో ఏర్పాటు చేసుకుందాం.. రాబోవు రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించబోతున్నామని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదని, నల్గొండ ,సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్ దే అని హర్షం వ్యక్తం చేశారు… మెడికల్, పీజీ సీట్లను పెంచి ఎంబిబిఎస్ విద్యార్థులు విదేశాల కు వెళ్లకుండా తెలంగాణలోనే ఏర్పాటు చేసుకున్నామని, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలలో ఉద్యోగ కోర్సులు కూడా ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బిబినగర్ లోఎయిమ్స్ ఆస్పత్రి ఇస్తామంటే ఐదు కోట్ల విలువైన భూమి ఇచ్చామని, అక్కడ ఎంబిబిఎస్ చదువుకున్న విద్యార్థులు కనీస సౌకర్యాలు కేంద్రం కల్పించలేదు,

కేంద్ర మంత్రులు ఒకసారి బిబినగర్ ఎయిమ్స్ కి వచ్చి అక్కడి దుస్థితి చూడాలి.సౌకర్యాలు కల్పించడంలో కేంద్రం విఫలమైంది. భువనగిరి ఎయిమ్స్ లో ఎమర్జెన్సీ సేవలు, బ్లడ్ బ్యాంక్ ,ఆపరేషన్ థియేటర్లు, గర్భిణులకు సేవలు అందించే సేవలు ఏవి లేవు.. అలంకార ప్రాయంగా ఎయిమ్స్ మారిందని … ఒక సంవత్సరంలో తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసామని ఇది తెలంగాణ ఘనత అని తెలిపారు. వచ్చే సంవత్సరంలో మరో ఎనిమిది కాలేజీలు ఏర్పాటు చేస్తామని, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఎంబిబిఎస్ సీట్లను మొదటి స్థానంలో పిజి సీట్ల విషయంలో రెండవ స్థానంలో ఉన్నమని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News