Sunday, December 22, 2024

ఐఎఫ్‌ఎస్ ర్యాంకర్ రాజుకు ఘన సత్కారం

- Advertisement -
- Advertisement -

Ministers honored IFS ranker Raju

 

ఎఫ్‌సిఆర్‌ఐ తరపున లక్ష రూపాయాల ప్రోత్సహకాన్ని అందజేసిన మంత్రులు

హైదరాబాద్ : తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్‌ఎస్ 86వ ర్యాంకు సాధించిన కాసర్ల రాజును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఘనంగా సత్కరించారు. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో అరణ్యభవన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో పాల్గొన్న మంత్రులు కాసర్ల రాజును సన్మానించారు. ఎఫ్‌సిఆర్‌ఐ తరపున లక్ష రూపాయాల ప్రోత్సాహకాన్ని రాజుకు మంత్రులు అందజేశారు. పరీక్షలో విజయం సాధించినందుకు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ అడవులు, పర్యావరణ రక్షణకు ప్రాధాన్యతనిస్తూ అటవీ విద్యను ప్రోత్సహించాలన్న సంకల్పంతో పాటు జాతీయ స్థాయి అధికారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను నెలకొల్పారని అన్నారు.

అటవీ కళాశాల స్థాపించిన అనతి కాలంలోనే కాసర్ల రాజు వంటి వారు తొలి ప్రయత్నంలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సాధించడం అటవీ కళాశాలకు గర్వకారణమన్నారు. పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదని నిరూపించి…రాజు అందరికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు వీలుగా విద్యార్థులకు ఉన్నతమైన విద్యాబోధనను అందించేందుకు కృషి చేస్తున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు, డీన్ ప్రియాంక వర్గీస్, అధ్యాపకులు, సిబ్బందిని ప్రత్యేకంగా మంత్రి అభినందించారు.ఐఎఫ్‌ఎస్ ర్యాంకర్ రాజు మాట్లాడుతూ తనకు తల్లిదండ్రులు ఎంతో అండగా నిలిచారని, ఎఫ్‌సిఆర్‌ఐ నుంచి చక్కని ఆదరణ లభించిందన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఏ. శాంతికుమారి, పిసిసిఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్, పిసిసిఎఫ్ (కంపా) లోకేష్‌జైస్వాల్, అదనపు పిసిసిఎఫ్ ఎంసి పర్గెయిన్, డీన్ ప్రియాంక వర్గీస్, డిప్యూటీ డైరెక్టర్ కె. శ్రీనివాస్, డిసిఎఫ్ ఎ.నరసింహరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News