Saturday, December 21, 2024

ఉమ్మడి జిల్లాలకు ఇన్ చార్జి మంత్రులు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్‌కు ఉత్తమ్, కోమటిరెడ్డికి ఖమ్మం బాధ్యతలు అప్పగింత
సీతక్కకు ఆదిలాబాద్, తుమ్మలకు నల్లగొండ, పొన్నంకు హైదరాబాద్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదివరకే కొన్ని హామీలు అమలు చేయగా, మరికొన్ని హామీల అమలుతో పాటు పాలనలో తమదైన మార్క్ చూపించేందుకు సి ఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నా రు. ఈ క్రమంలో తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు మంత్రులను ఇన్‌చార్జీలుగా నియమించారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు సం బంధిత జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం అమలును సమీక్షించి, పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి -కరీంనగర్, దామోదర రాజనరసింహ – మహబూబ్ నగర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఖమ్మం, దుద్దిళ్ల శ్రీధర్ బాబురంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్, పొన్నం ప్రభాకర్‌హైదరాబాద్, కొండా సురేఖమెదక్, అనసూయ సీతక్క ఆదిలాబాద్, తుమ్మల నాగేశ్వర రావునల్గొండ, జూపాల్లి కృష్ణారావునిజామాబాద్‌కు నియమితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News