- Advertisement -
గిరిజనులు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించే నాగోబా జాతరకు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. గిరిజన ఆరాధ్య దైవమైన నాగోబాను దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజన దర్బార్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేఖా శ్యాంనాయక్, రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి మెస్రం వంశీయులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -