Saturday, December 21, 2024

మంత్రులతో ముఖాముఖిలో ఫిర్యాదుల వెల్లువ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజా పాలన లో భాగంగా ‘మంత్రులతో ముఖాముఖీ’ కార్యక్రమం బుధవారం గాంధీభవన్‌లో అట్టహాసం గా ప్రారంభమయ్యింది. ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకునేందుకు ప్రజలు బారులు తీరా రు. మొదటి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు దాదాపు నా లుగున్నర గంటలపాటు నిర్విరామంగా ఈ కా ర్యక్రమం కొనసాగింది. మొదటి రోజు ఈ కా ర్యక్రమంలో భాగంగా సిడబ్లూసీ సభ్యులు, వై ద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ న ర్సింహ పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీ కరించారు. అయితే, గతంలోనూ తాము ప్రజాభవన్‌లో దరఖాస్తులను ఇచ్చామని ఇప్పటివర కు వాటికి పరిష్కారం దొరకలేదని అందుకే ఇ క్కడకు వచ్చామని ప్రజలు మంత్రితో పేర్కొన డం విశేషం.

విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వైద్య సేవలు అవసరం ఉన్నవారు, డ బుల్ బెడ్‌రూం, రేషన్ కార్డులు, రెవెన్యూ సమస్యలు ఇలా అనేక సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందజేశారు. మహిళలు, వికలాంగులు, గర్భిణులు,వృద్ధుల కోసం ప్రత్యేకకౌంటర్‌లు ఏ ర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులకు స్వీకరించినప్పుడు మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన దరఖాస్తులను టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు టిపిసిసి సిబ్బంది కంప్యూటర్ లో శాఖల వారీగా దరఖాస్తులను నమోదు చేశారు.. ఆయా శాఖల వారీగా దరఖాస్తులను టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లేఖలను జత చేసి మంత్రులకు పంపనున్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి దామోదర
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడంపై మంత్రి దామోదన రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ‘మంత్రుల ముఖాముఖీ’ కార్యక్రమం ఒక నిరంతర ప్రక్రియ అని, ప్రజలు ప్రశాంతంగా ఉండి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని మంత్రి సూచించారు. గాంధీ భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం అద్భుతమైన ఆలోచనగా ఆయన అభివర్ణించారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, సిఎం రేవంత్ రెడ్డికి వచ్చిన గొప్ప ఆలోచన అని ఆయన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీ భవన్‌కు వచ్చి అర్జీలను స్వీకరించడంతో పాటు వాటి పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వారి ఆశలు అడియాసలు కాకుండా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. పార్టీకి ప్రభుత్వానికి ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతుందని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు అనే తేడా లేకుండా అందరి అర్జీలు తీసుకొని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఓవర్ నైట్‌లో సమస్యలు పరిష్కారం అవుతాయని తాము అనుకోవడం లేదన్నారు. ఒక్కోక్కటి చేస్తే అన్ని పరిష్కారం అవుతాయన్నారు. గతంలో సమస్యలు వినేవారే లేరని, కానీ, ఇప్పుడు తాము చాలా సమయం ఇస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News