మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభలో సోమవారం మధ్యాహ్నం పలు బడ్జెట్ పద్దులను మంత్రులు ప్రవేశపెట్టారు. సిఎం కెసిఆర్ తరపున మంత్రి హరీశ్‌రావు సాగునీరు, ఆయకట్టు అభివృద్ధి కోసం రూ.22,637,82,35,000 మొత్తాన్ని బడ్జెట్ పద్దును సభలో ప్రతిపాదించారు. అదే విధంగా గవర్నర్, మంత్రిమండలి అభ్యర్థన కింద రూ.27,56,03,000ను, సాధారణ పరిపాలన, ఎన్నికల నిర్వహణ కింద రూ.287,31,74,000 ప్రతిపాదించారు.విత్త పాలన, ప్రణాళిక, సర్వేలు, గణాంకా కింద రూ.14,918,96,80,00 మొత్తానికి హరీశ్‌రావు ప్రతిపాదించారు.
పంచాయతీరాజ్ శాఖకు రూ.12,811,92,11,000ను,- గ్రామీణాభివృద్ధి కింద రూ.12,286,63,44,000 మొత్తాన్ని ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిపాదించారు. రహదార్లు, భవనాలు, శాసన వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రహదార్లు, భవనాలకు రూ.17,599,11,05,000 ప్రతిపాదించారు.- రాష్ట్ర శాసనమండలి కింద రూ.151,30,03,000లకు మించని ప్రతిపాదించారు.- ఇంధనం శాఖ కింద రూ. 9,374,86,29,000ను మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రతిపాదించారు.- న్యాయపాలన కింద రూ.1,186,14,33,000ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రతిపాదించారు. వివిధ పద్దులపై మంత్రులు ప్రతిపాదించిన బడ్జెట్ కేటాయింపులపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించి, ఆమోదించారు.