సిద్దిపేట: రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కెటిఆర్‌లు 15న సిద్దిపేటలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఇర్కోడ్ గ్రామంలో ఆరుకోట్లతో నిర్మించిన స్లాటర్ హౌస్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 11 గంటలకు సిద్దిపేట పట్టణంలోని వివిధ వార్డుల్లో 20 కోట్లతో నిర్మించనున్న రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి 11.15 గంటలకు నాసర్‌పురాలోని కప్పల కుంటను 3 కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనులను ప్రారంభిస్తారు. 11.45 గంటలకు మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేటకు వచ్చే రింగ్‌మేన్ నీటి సరఫరాను లాంఛనంగా ప్రారంభించి 12 గంటలకు స్వచ్ఛబడిని సందర్శించి అక్కడే స్వచ్ఛ పాఠాల ప్రదర్శనలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అర్బన్ పార్కు ఎదురుగా 63 కోట్లతో నిర్మించిన ఐటి టవర్‌ను మంత్రులు ప్రారంభించి అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
నేడు సిద్దిపేటలో మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావుల పర్యటన
- Advertisement -
- Advertisement -
- Advertisement -