Wednesday, January 22, 2025

ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్ అంతర్జాతీయ సదస్సుకు మంత్రులు కెటిఆర్, సింగిరెడ్డి

- Advertisement -
- Advertisement -

22న బయల్దేరి వెళ్లనున్న అమాత్యులు

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘బోర్లాగ్’ అం తర్జాతీయ సదస్సుకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు అనుమతిస్తూ రా ష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పదేళ్ల తెలంగాణ వ్యవసాయరంగ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాలని మంత్రి కెటిఆర్‌ను ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్’ అధ్యక్షుడు టెర్రీ బ్రాన్ స్టాడ్ ఆహ్వానించారు. తెలంగాణ ప్ర భుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయంలో సాధించిన పురోగతిని గమనించి ప్రత్యేకంగా ఆహ్వానించిన బోర్లాగ్ సదస్సు ఈ నెల 24 నుండి 26 వరకు అమెరికాలోని అయోవా రాష్ట్రం డెమోయిన్ నగరంలో జరిగే ఈ సదస్సులో మంత్రులు కెటిఆర్, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రసంగించనున్నారు.

ప్రపంచ హరితవిప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ పేరు మీద ప్రతి ఏటా సదస్సులు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యవసాయరంగంలో ఆహార భద్రతకు ఎదురయ్యే సవాళ్లపై ఈ సమావేశాల్లో చర్చ జరుగుతుంది. ప్ర పంచ దేశాల నుండి 1200 మంది హాజరుకానున్నారు. వేలాది మంది ఆన్ లైన్ మాధ్యమం లో భాగస్వాములు కానున్నా రు.కెటిఆర్, నిరంజన్ రెడ్డిలు ఈ నెల22 నుండి 29 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. మంత్రులతో పా టు ఆర్థిక శాఖ కార్యదర్శి రా మకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, తెలంగాణ సీడ్స్ ఎండి డాక్టర్ కేశవులు బృందం అమెరికా వెళ్ళనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News