Friday, November 22, 2024

దోషులు ఎవరైనా వదిలేది లేదు:మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : కేఎంసీ మెడికల్ విద్యార్థిని ప్రీతి మృతికి కారకులైన దోషులు ఎవరైనా వదిలేది లేదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. ప్రీతి బౌతికంగా లేకపోయినప్పటికీ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని ప్రీతి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. తొర్రూరు బహిరంగ సభలో పాల్గొని పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన బుధవారం సాయంత్రం పాల్గొనడానికి వెళ్తున్న మంత్రి కేటీఆర్‌ను స్థానిక మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌లు తీసుకొని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో ప్రీతి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రీతి తల్లిదండ్రులను, అక్కా, తమ్ముళ్లను అక్కున చేర్చుకొని ఓదార్చారు. వారి కుటుంబ పరిస్థితులు, మిగిలిన పిల్లల చదువులు, ఇతర పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు.

ప్రీతి మరణంపై జరుగుతున్న కేసు విచారణ, ఇతర వివరాలపై కూడా క్షుణ్ణంగా మంత్రులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రీతి మృతికి కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే కేసును పలు కోణాల్లో విచారణ జరిపించి దోషులకు శిక్ష పడే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా కుటుంబానికి కావాల్సిన సహాయ కార్యక్రమాలు చేస్తున్నామని, ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయన్నారు. పార్టీ పరంగా కూడా ప్రీతి కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం జరిగేందుకు వెన్నంటే ఉంటుందని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఎలాంటి అవసరాలు ఉన్నా కేసులు సంబంధించిన వివరాలు, ఇతర పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో పంచుకోవాలన్నా స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉంటారని, అవసరమైతే తనను కూడా కలవచ్చని సూచించారు.
పణికర మల్లయ్యను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న మంత్రి కేటీఆర్…
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గోసను తన మాటల్లో సీఎం కేసీఆర్‌కు చెప్పిన పణికర మల్లయ్యను మంత్రి కేటీఆర్ తొర్రూరుకు వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా కలుసుకొని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. బుధవారం తొర్రూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ తిరిగి వెళ్తున్న క్రమంలో మంత్రి దయాకర్‌రావు ఆధ్వర్యంలో పణికర మల్లయ్య మంత్రి కేటీఆర్‌ను కలవడానికి వచ్చారు. ఈ సందర్భంగా పణికర మల్లయ్యను చూసిన మంత్రి కేటీఆర్ బాగున్నావా మల్లన్న…

తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన మల్లన్నను కలవడం తనకు ఆనందంగా ఉందంటూ అతన్ని అక్కును చేర్చుకున్నారు. పణికర మల్లయ్యతో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. పణికర మల్లయ్య తొర్రూరులో మరోసారి కేటీఆర్‌ను కలవడం తెలంగాణ ఉద్యమకారులకు, పార్టీ శ్రేణులకు, ఎమ్మెల్యేలకు గత స్మృతులను గుర్తు చేసినట్లయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News