Thursday, January 23, 2025

ఢిల్లీకి బయలుదేరిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీగా ఆవిర్భవించి, దేశ రాజధాని ఢిల్లీలో భారాస జాతీయ కార్యాలయాన్ని రేపు ప్రారంభించుకోనున్న శుభ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఢిల్లీలో చేసే రాజ శ్యామల యాగం, కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నేడు ఢిల్లీకి బయలుదేరారు.

ఢిల్లీకి వెళ్తున్న బారాస నేతలతో శంషాబాద్ విమానాశ్రయం సందడిగా మారింది. ఉద్యమ పార్టీ నుంచి అధికార పార్టీగా మారి, ఇపుడు జాతీయ పార్టీగా అవతరించనున్న సందర్భంగా తెలంగాణ నేతలు విజయ సంకేతం చూపుతూ ఉత్సాహంతో దేశ రాజధానికి బయలుదేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News