- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ తప్పుడు ఇమేజ్‌ని కాపాడేందుకు కేంద్రమంత్రులు ఏ సబ్జెక్ట్‌పైనైనా మాట్లాడేలా ఒత్తిడికి గురవుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. కొవిడ్19 కట్టడికి ప్రధాని కృషి చేస్తున్నారని, ఈ ఏడాది డిసెంబర్ వరకల్లా దేశ పౌరులందరికీ వ్యాక్సిన్లు అందుతాయని కేంద్ర సమాచారశాఖమంత్రి చేసిన ప్రకటనకు స్పందనగా రాహుల్ ఈ విమర్శ చేశారు. ఆరోగ్యశాఖ అంశంపై సమాచారశాఖమంత్రి స్పందించడంపై రాహుల్ ఎద్దేవా చేశారు. అంతకుముందు రాహుల్ చేసిన విమర్శల్లో టీకాల అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఉండగా, ప్రధాని మోడీ మాత్రం నాటకీయంగా వ్యవహరిస్తున్నారని, సెకండ్ వేవ్ గురించి సరైన అంచనా లేకపోవడం వల్లేనని రాహుల్ విమర్శించారు.
- Advertisement -