Tuesday, January 21, 2025

జిహెచ్ఎంసి పరిధిలో 11,700 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: జిహెచ్ఎంసి పరిధిలో శనివారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రేటర్ పరిధిలోని ఎనిమిది ప్రాంతాల్లో 11,700 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పలువురు మంత్రులు పంపిణీ చేయనున్నారు.

కొల్లూరు, అమీన్ పూర్ లో మంత్రి హరీశ్ రావు, కుత్బుల్లాపూర్, బాచుపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అహ్మద్ గూడలో మంత్రి మల్లారెడ్డి, పటన్ చెరులో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, బహదూర్ పుర్, ఫారఖ్ నగర్ లో మంత్రి మహమూద్ అలీ, మహంకాల్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉప్పల్ శ్రీరాంనగర్ లో మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ప్రతాప్ సింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News