Sunday, April 6, 2025

రష్యా సైనికులుగా వెళ్లవద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతీయ పౌరులు ఎవరూ కూడా తొందరపడి ఉక్రెయిన్‌తో ఘర్షణలో రష్యా సైన్యంలో చేరవద్దని విదేశాంగ మంత్రిత్వశాఖ విజ్ఞప్తి చేసింది. ఘర్షణల ప్రాంతంలో రష్యా సైనిక దళాలలో సహాయకులుగా పనిచేసేందుకు కొందరు భారతీయ పౌరులు సిద్ధపడి , కాంట్రాక్టు పత్రాలపై సంతకాలు చేశారనే వార్తలపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) శుక్రవారం స్పందించింది. సంబంధిత విషయం తమ దృష్టికి వచ్చిందని, పౌరులు ఎవరూ ఇటువంటి నిర్ణయాలు తీసుకోరాదని తాము కోరుతున్నట్లు మంత్రిత్వశాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఇప్పటికే ఎవరైనా పౌరులు సైనిక దళాల్లో చేరితే వారిని డిశ్చార్జ్ చేసేలా చూసేందుకు మాస్కోలోని భారతీయ రాయబార కార్యాలయం చర్యలు చేపట్టిందని కూడా వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News