- Advertisement -
పూణే జిల్లాలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆగి ఉన్న బస్సును మినీ వ్యాను ఢీకొట్టడంతో అందులో ఉన్న 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పూణే-నాసిక్ హైవేపై నారాయణ్‌గావ్ వైపు వెళ్తున్న మినీ వ్యాన్‌ను టెంపో ఢీకొట్టింది. దీంతో మినీ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఖాళీ బస్సును బలంగా ఢీకొట్టింది. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి పోలీస్‌లు తరలించారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -