- Advertisement -
మిన్నెసోటా(అమెరికా): అమెరికాలో కురిసిన వాన వరదయి జనావాసాలను ముంచెత్తుతోంది. అక్కడి యోవా, దక్షిణ డకోటా, మిన్నెసోటా, నెబ్రోస్కా రాష్ట్రాలతో దాదాపు 30,00,000 మంది ఇబ్బందులు పడుతున్నారు. మిన్నెసోటాలో బ్లూఎర్త్ కౌంటీలో ఉన్న ది ర్యాపిడాన్ డ్యామ్ వరద తీవ్రతకు బద్దలయింది. దక్షిణ మిన్నెసోటా ప్రాంతమయితే ఇప్పటికే వరదల్లో ఉంది.
ఐయోవాలోని రాక్ ర్యాపిడ్స్ ప్రాంతంలో 11 అంగుళాల వాన పడింది. నీరు భూమిలో ఇంకా ఇంకే అవకాశం లేకపోవడంతో వరద ఏర్పడిందని జోసెఫ్ అనే వాతావరణ నిపుణుడు పేర్కొన్నాడు.
- Advertisement -