Sunday, November 17, 2024

ఇద్దరు టెకీల మృతికి కారకుడైన మైనర్‌కు బెయిల్

- Advertisement -
- Advertisement -

అతి వేగంతో కారు నడిపి, బైకును ఢీకొట్టి ఇద్దరు యువకుల మరణానికి కారకుడైన ఒక 17 ఏళ్ల బాలుడికి అరెస్టు అయిన 15 గంటల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే నిందితుడైన మైనర్ బాలుడికి కోర్టు కొన్ని షరతులు విధించినట్లు అతని తరఫు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ ‘సోమవారం తెలిపారు. యరవాడలో 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలసి పనిచేయాలని, ప్రమాదాలపై ఒక వ్యాసం రాయాలని, మద్యం అలవాటు మానుకునేందుకు చికిత్స పొందడంతోపాటు కౌన్సిలంగ్ సెషన్స్‌కు హాజరుకావాలని ఆ బాలుడికి కోర్టు షరతులు విధించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల అనీష్ అవధీయ, అశ్వినీ కోష్టా ఇంజనీర్లు పుణెలో పనిచేస్తున్నారు. శనివారం రాత్రి మిత్రులతో కలసి ఒక కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగివెళుతుండగా 200 కిలీమీటర్ల వేగంతో దూసుకువచ్చిన ఒక కారు వారి బైకును ఢీకొట్టింది. నంబర్ ప్లేట్లు కూడా లేని ఆ కారు ఢీకొనడంతో అశ్వినీ 20 అడుగుల ఎత్తు గాలిలో ఎగిరి కింద పడ్డాడు.

అనీష్ ఆగి ఉన్న ఒక కారుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బైకును ఢీకొన్న తర్వాత అక్కడి నుంచి పారిపోవడానికి కారు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే ఎయిర్‌బాగులు తెరుచుకోవడంతో రోడ్డు కనిపించక కారును నడపలేకపోయాడు. కారులో మైనర్ బాలుడితోపాటు మరో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు తప్పించుకుని పారిపోగా మిగిలిన ఇద్దరినీ ప్రత్యక్ష సాక్షులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. 12వ తరగతి పరీక్షల్లో పాసైన ఆనందంలో ఒక రియల్టర్ కుమారుడైన ఆ మైనర్ బాలుడు తన మిత్రులతో కలసి పబ్‌లో పార్టీ చేసుకుని తిరిగివస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే 18 ఏళ్ల వయసు ఉండాలి. మైనాటిరీ తీరడానికి అతనికి మరో నాలుగు నెలల సమయం ఉంది. మృతుల మిత్డు కొరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైనర్ బాలుడితోపాటు అతని తండ్రి, పబ్ యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News