Monday, January 20, 2025

డబ్బు కోసి మైనర్ బాలుడి అపహరణ..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి:- సైబరాబాద్ కమిషనరేట్ కడ్తాల్ పోలిసు స్టేషన్ పరిధిలో మైనర్ బాలుడి కిడ్నాప్‌ను ఛేదించిన పోలీసులు. నలుగురు నింధితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కిడ్నాప్ చేసేందుకు వాడిన కారును సీజ్ చేశారు. కేసు వివరాలను శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి తన కార్యాలయంలో మీడియాకు వివరించారు. కడ్తాల్ గ్రామానికి చెందిన కొప్పుల లక్ష్మి కూరగాయల నర్సరీ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తుంది లక్ష్మీకి ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నర్సరీలో తనకు చేదోడు వాదోడుగా ఉండేవాడు 20 తారీకున ఉదయం ఆరు గంటల సమయంలో లేచి చూడగా తన కుమారుడు, స్కూటీ కనిపించలేదు వెంటనే పక్కనే ఉన్న నర్సరీ వద్దకు వెళ్లి చూడగా స్కూటీ పార్క్ చేయబడి కనిపించింది కుమారుడు కనిపియకపోవడంతో 16 సంవత్సరాల కొడుకును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ పోన్ చేస్తే రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు కడ్తాల్ పోలిస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

వెంటనే పోలీసులు తన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 129/2023 U/a364 A IPC సెక్ష న్ 84 JJ యాక్టు కింద కడ్తాల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అయితే ఫిర్యాదు అందుకున్న పోలీసులు సిసిటివి, సిడిఆర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బాలుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేస్తే వేరే వ్యక్తులు ఫోన్ లిఫ్ట్ చేసి నీ బిడ్డ క్షేమంగా ఉండాలంటే 2 కోట్లు ఇవ్వాలని విషయం పోలీసులకు చెప్పారంటే చంపుతామని బెదిరించారు. అయితే బాధితురాలు లక్ష్మి కర్నాటకలో నర్సరీ నిర్వహించినప్పుడు అమె వద్ద పనిచేసిన గౌని భసవరాజ్ (29) అనే వ్యక్తి లక్ష్మి వద్ద నర్సరీ వ్యాపారం చేసేందుకు రూ.11 లక్ష లు అప్పుగా అలాగే మరో రూ.15 లక్షలు పూచికత్తుగా ఉండి వేరే వారి వద్ద నుం డి ఇప్పించినది తీసుకున్న డబ్బులతోపాటు పూచీకత్తుపై ఇప్పించిన డబ్బులు తిరి గి ఇవ్వమనందుకు బాబును కిడ్నాప్ చేసినట్లు తేలింది.

కిడ్నాప్‌కు సహకరించిన ప్రధాన నిందితుడు భసవరాజ్‌తోపాటు చిన్నారెడ్డి గూడెం (24), బుజంగం (28), చిలుకూరు కుమార్ (32)లు కడ్తాల్ నుండి షాద్‌నగ ర్, పరిగి, నారాయ ణ్‌పేట్, అదోనీ, అలుర్, మంత్రాలయం వైపు వెల్తునట్లుగా గుర్తించిన పోలీసులు కర్నూల్,ఆలూర్ పోలీసుల సహాయంతో నిందితులను పట్టుకున్నారు. కిడ్నాప్‌కు గురైన బాలుని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించి నిందితులను రిమాండ్‌కు తరలించారు. అయితే కేసులో ప్రతిభ చూపించిన పో లీసులు సైబరాబాద్ కమిషనర్ స్టీఫన్ రవీంద్ర, శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి, రాంకుమార్ అడిషనల్ డీసీపీ శంషాబాద్, ఆధ్వర్యంలో షాద్‌నగర్ ఏసిపి రంగస్వామి, పర్యవేక్షణలో సీఐ వెంకటేశ్వర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ శంకర్‌గౌడ్, కడ్తా =ల్ సబ్ ఇన్‌స్పెక్టర్ బలరామ్, ఎస్సై అమాన్, తలకొండపల్లి ఎస్సై వెంకటేష్ కే సులో ప్రతిభకనబరిచిన కడ్తాల్ పోలీసులకు అధికారులకు రివార్డు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News