Monday, December 23, 2024

హల్దీ వేడుకలో కాల్పులు.. బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

ప్రతాప్‌గఢ్ : ఉత్తరప్రదేశ్ లోని ఆస్‌పూర్ దేవ్‌సర పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో శుక్రవారం హల్దీ వేడుకలో తుపాకీ కాల్పులకు 16 ఏళ్ల దళిత బాలుడు అజయ్‌కుమార్ మృతి చెందాడు. నిందితునిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంతోష్ సింగ్ ఆదివారం వెల్లడించారు. ఫూల్‌చంద్రదూబే కుమార్తె వివాహం శనివారం జరగవలసి ఉండగా ముందుగా నిర్వహించే హల్దీ వేడుకలో ఈ సంఘటన జరిగింది.

దూబే దగ్గరి బంధువు పింతు ఈ వివాహంలో పాల్గొనడానికి ముంబై నుంచి వచ్చాడు. ఆయన తన లైసెన్స్‌డ్ పిస్టల్‌తో టెంట్ కంపెనీ బాలుడు అజయ్‌కుమార్‌పై కాల్పులు జరపగా తీవ్రంగా గాయపడ్డాడని సింగ్ తెలిపారు. వెంటనే ప్రయాగ్‌రాజ్‌కు చికిత్స కోసం తరలించగా గాయాలతో అక్కడ చనిపోయాడని సింగ్ చెప్పారు. మృతుని తండ్రి సురేష్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరానికి ఉపయోగించిన పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News