- Advertisement -
న్యూఢిల్లీ : ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం 3.36 గంటలకు 2.6 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర జిల్లాలో భూమికి 10 కిమీ దిగువన ఈ భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలియజేసింది. అయితే ప్రాణనష్టం లేదా ఆస్థినష్టం జరిగినట్టు ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. కొన్ని రోజుల క్రితం పశ్చిమనేపాల్‌లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత ఢిల్లీ, ఉత్తరాదిలో కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) సెస్మిక్ జోనింగ్ మ్యాప్ ప్రకారం అధిక భూకంప ప్రమాద జోన్‌గా పరిగణించే నాలుగో జోన్‌లో ఢిల్లీ, ఎన్‌సిఆర్ వస్తాయి.
- Advertisement -