Monday, December 23, 2024

కరీంనగర్ యాక్సిడెంట్…. మైనర్ తండ్రి అరెస్ట్: కరీంనగర్ సిపి

- Advertisement -
- Advertisement -

Minor father arrested in Karimnagar road accident

హైదరాబాద్: కరీంనగర్ యాక్సిడెంట్ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నామని కరీంనగర్ సిపి సత్యనారాయణ వెల్లడించారు. కరీంనగర్ కమాన్ సెంటర్ వద్ద జరిగిన యాక్సిడెంట్ మైనర్ల నిర్వకమేనని తేల్చారు. కారు యాక్సిడెంట్ చేసింది 16 సంవత్సరాల మైనర్ అని పేర్కొన్నారు. మైనర్లు కారు డ్రైవింగ్ చేయడంతో నలుగురు యువతుల మృతికి కారణమయ్యారు. యాక్సిడెంట్ సమయంలో కారులో ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. కారును మైనర్లకు ఇచ్చిన రాజేంద్రప్రసాద్‌ను అరెస్ట్ చేశామని సిపి తెలిపారు. కారు వంద స్పీడుతో వెళ్లి గుడిసెలోకి దూసుకెళ్లడంతో నలుగురు యువతులు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కారు ప్రమాదానికి కారణమైన మరో ఇద్దరు మైనర్లు పరారీలో ఉన్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News