Monday, December 23, 2024

స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. బాలికపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Minor girl allegedly raped in Lalitpur UP

 

లక్నో: పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన 13 ఏళ్ల అత్యాచార బాధితురాలిపై పోలీస్ మళ్లీ అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌ జరిగింది. పాలీ రైల్వే స్టేషన్ సమీపంలో మైనర్ పై ముగ్గురు అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలి పారిపోయారు. అనంతరం బంధువుతో కలిసి బాలిక పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. వాగ్మూలం కోసం స్టేషన్ కు పిలిపించిన ఇన్ స్పెక్టర్ బాలికపై అత్యాచారం చేశాడు. తర్వాత బాలికను తన అత్తకు అప్పగించాడు. నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని యువతి ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్పీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ తిలకధారి సరోజ్‌ను సస్పెండ్ చేశారు. అతనిపై క్రిమినల్ కేసు పెట్టారు.

అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, మూడు పోలీసు బృందాలు అతని కోసం వెతుకుతున్నాయని లలిత్‌పూర్‌లోని ఒక ఉన్నత పోలీసు అధికారి తెలిపారు. మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు. సంఘటన జరిగిన స్టేషన్‌లో పోలీసులందరినీ విధుల నుండి తొలగించారని తెలిపారు. డీఐజీ స్థాయి అధికారి ఈ కేసును విచారించి 24 గంటల్లో నివేదికను సమర్పించనున్నారు. నలుగురు వ్యక్తులు ఆమెను ప్రలోభపెట్టి ఏప్రిల్ 22న భోపాల్‌కు తీసుకెళ్లారని, అక్కడ నాలుగు రోజుల పాటు అత్యాచారం చేశారని బాలిక తండ్రి మంగళవారం దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. నిందితుడు ఆమెను తిరిగి స్వగ్రామానికి తీసుకువచ్చి, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో పడవేసి పారిపోయారని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News