Friday, December 27, 2024

యుపి ప్రభుత్వ అతిథి గృహంలో రక్తస్రావంతో మైనర్ బాలిక

- Advertisement -
- Advertisement -

Minor girl bleeding in UP Govt guest house

ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు

కన్నోజ్(యుపి): తీర్వా ప్రాంతంని ఒక ప్రభుత్వ అతిథి గృహం వద్ద పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతూ 12 ఏళ్ల బాలిక రక్తస్రావంతో కనిపించడం సంచలనం సృష్టించింది. నొప్పితో విలవిలలాడుతున్న ఆ మైనర్ బాలికను అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు తమ సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో దర్శనమిచ్చాయి. ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఆ బాలికను ఆటోరిక్షా వద్దకు ఒక పోలీసు అధికారి నడిపించుకుని వెళుతున్న దృశ్యం కూడా ఆ వీడియోలో కనిపించింది. పిగ్గీ బ్యాంక్ కొనడానికి ఇంట్లో నుంచి ఆదివారం బయటకు వెళ్లిన ఆ బాలిక తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారని జిల్లా ఎస్‌పి కన్వర్ అనుపమ్ సింగ్ తెలిపారు.

ఆ మైనర్ బాలిక వెంట ఒక యువకుడు ఉన్నట్లు కనపడుతోందని, అయితే వైద్య పరీక్షల నివేదికలు వచ్చే వరకు ఆమెపై అత్యాచారం జరిగిందన్న విషయం నిర్ధారించలేమని ఎస్‌పి తెలిపారు. అతిథి గృహం వద్ద పనిచేసే గార్డు ఒకరు రక్తంతో తడిసిన దుస్తుల్లో నొప్పితో విలవిలలాడుతున్న ఆ బాలికను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు ఆయన చెప్పారు. పోలీసు ఔట్‌పోస్టు ఇన్‌చార్జ్ మనోజ్ పాండే వెంటనే అక్కడకు వెళ్లి ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఒక యువకుడితో ఆ బాలిక మాట్లాడుతున్న దృశ్యాలు గెస్ట్ హౌస్‌లోని సిసిటివి ఫుటేజ్‌లో లభించినట్లు ఆయన చెప్పారు. ఆ యువకుడి ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News