Thursday, November 28, 2024

పుట్టినరోజు నాడే విషాదం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట జిల్లా, కొమురవెల్లి పరిధిలోని నాగపురి గ్రామంలో గురువారం కరెంట్ షాక్‌తో 16 ఏళ్ల బాలిక మృతి చెందింది. గురువారం ఆమె పుట్టిన రోజు. ఆమె పుట్టిన రోజునాడే విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఉదయం 7:40 గంటలకు నాగపురి గ్రామానికి చెందిన మజ్జిగ నరసింహులు కుమార్తె మజ్జిగ కావ్య ఇంట్లో కుళాయి నుండి నీరు పట్టేందుకు మోటర్‌ను ఆన్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మోటార్‌కు ఉన్న వైరు తేలి ఉండడం ఆమె గమనించకపోవడంతో వైరు తగిలి కరెంట్ షాక్‌తో కిందపడింది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆమెను చేర్యాల గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించగా డాక్టర్ పరిశీలించి అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News