Thursday, December 19, 2024

ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లి.. మైనర్ బాలిక మిస్సింగ్

- Advertisement -
- Advertisement -

 

రాజేంద్రనగర్ : ఇంటి నుండి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్లి బాలిక కనిపించకుండాపోయిన సంఘటన నగరంలోని రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది. సాయంత్రం వరకు బాలిక ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాలిక హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ఫ్రాంక్‌ఫిన్ ఇన్స్టిట్యూట్ లో ఎయిర్ హోస్టెస్ గా శిక్షణ పొందుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. తమ కూతురిని కిడ్నాప్ చేశారంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. యువతి గత వారం కింద కనిపించకుండ పోయింది. పోలీసులు సిసిటిటి ఫూటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ యువతి ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News