Thursday, January 23, 2025

రాజస్థాన్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్ లోని కుచమన్ జిల్లా లడ్నూస్ ప్రాంతంలో 16 ఏళ్ల మైనర్ బాలికను ఇంట్లోనుంచి కిడ్నాప్ చేసి, అడవి లోకి తీసుకెళ్లి ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. నిందితుల్లో ఒకరు మైనర్ కావడం గమనార్హం. ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ముగ్గురు యువకులు తమ కుమార్తెను ఇంటికి వచ్చి కిడ్నాప్ చేశారని, రాత్రి 1 గంట సమయంలో ఆమెను కారుపై తీసుకువచ్చి రోడ్డుపై వదిలేసి పరారయ్యారని బాలిక తండ్రి పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. స్థానికులు కారును వెంబడించినా నిందితులు తప్పించుకుని పరారయ్యారని ఫిర్యాదు చేశారు.

ఈ సంఘటనలో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామని పోలీస్‌లు తెలిపారు. పరారీలో ఉన్న మూడోవ్యక్తి కోసం గాలిస్తున్నామని చెప్పారు. బాలికను లడ్నూస్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఈ సంఘటనకు నిరసనగా లడ్నూస్ ఆస్పత్రి ఎదుట పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసన తెలిపారు. దీనికి బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తామని హెచ్చరించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News