Monday, January 20, 2025

శారీరకంగా కలవకుంటే చంపేస్తా..

- Advertisement -
- Advertisement -

చింతకానిః మండల పరిధిలోని లచ్చగూడెం గ్రామంలో కస్తూరిబా బాలికల వసతి గృహంలో చదువుతున్న ఓ మైనర్ బాలికలపై 40 ఏళ్ళ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. లచ్చగూడెం గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక అదే గ్రామంలో ఉన్న కస్తూరిబా బాలికల వసతి గృమంలో 9వ తరగతి చదువుతుంది. తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో తండ్రి తాగుబోతుగా మారడం, పరిస్థితులు శాపంగా మారడం వలన చదువుకోవాలనే తపనతో అదే గ్రామంలో ఉన్న కొందరు పెద్ద మనుషుల సహాయంతో హాస్టల్లో చేరడం జరిగింది.

వారం రోజుల క్రితం ఇంటి దగ్గర ఉన్న తన తండ్రిని చూసేందుకు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలికపై అదే గ్రామంలో ఉంటున్న బెజ్జలబోయిన నాగరాజు (40) అనే వ్యక్తి పాపపై కన్నేసి చంపేస్తానని గత వారం రోజులుగా తనతో కలవాలని, లేకుంటే కత్తితో పొడిచి చంపుతానని బెదిరిస్తూ శారీరకంగా అనుభవించాడని బాలిక తెలిపింది. తండ్రికి చెప్పుకోలేని పరిస్థితుల్లో హాస్టల్‌కి వెళ్ళిన మైనర్ బాలిక అక్కడ ఉపాధ్యాయులకు తెలియపరచింది.

వెంటనే ఆ ఉపాధ్యాయురాలు ఐసిడిఎస్ అధికారులకు పాప చెప్పిన వివరాలు తెలియజేయగా వారు హాస్టల్‌కు వచ్చి ఆ బాలికను తీసుకుని చింతకాని పోలీస్‌స్టేషన్‌లో బాలికతో పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీనిపై వైరా ఏసిపి రెహమాన్ వెంటనే స్పందించి కేసును దర్యాప్తు చేసి నిందితుడు నాగరాజుపై రేప్ కేసు, ఫోక్ యాక్ట్ క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దర్యాప్తులో చింతకాని ఎస్సై పొదిలి వెంకన్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News