మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ లో మైనర్ బాలికపై గత మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడిన నిందితుడు వేణుపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. మైనర్ బాలికపై వేణు అనే యువకుడు మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… వేణు అనే యువకుడు ఆ బాలికకు పెళ్లిచేసుకుంటానని మాయ మాటలు చెప్పి శంషాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్లోని సింగరాయకొండకి తీసుకొని వెళ్లాడు. ఈక్రమంలో బాలికను సింగరాయకొండకు తీసుకొని వెళ్లిన యువకుడు పెండ్లి చేసుకోకుండా గత మూడు నెలలుగా బాలికపై అగాయిత్యానికి పాల్పడ్డాడు. అసలు విషయం తెలియడంతో బాలిక కుటుంబ సభ్యులు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికను తీసుకొని వెళ్లిన వేణును బెంగుళూరులో అరెస్ట్ చేశారు. నిందితుడు వేణుపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.