Friday, November 22, 2024

క్షుద్ర పూజలు.. మైనర్ బాలిక ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

గోషామహల్: చదువుతో పాటు ఆట పాటల్లో చురుగ్గా ఉంటూనే టిక్ టాక్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న మైనర్ బాలిక అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది , కాగా అమావాస్య నుండి మృతురాలి ఇంటి ఎదుట క్షుద్ర పూజలు నిర్వహించడం వల్లే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని, ముమ్మాటికీ ఇది క్షుద్ర పూజలతో చేసిన హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేయడంతో పాటు తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన పై కుల్సుంపురా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన సంబంధిత వివరాలు, ఇన్‌స్పెక్టర్ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. .. మెదక్ జిల్లాకు చెందిన రమాదేవి, శ్రీనివాస్ దంపతులు గత కొన్నేళ్లుగా జియాగూడ భరత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.

శ్రీనివాస్ వృత్తి రీత్యా వ్రైడర్. వీరికి ముగ్గు రు కూతుళ్లు సంజన, నవ్య, దివ్యలు సంతానం. వీరిలో మొదటి కూతురు డిగ్రీ, రెండో కూతురు ఇంటర్మీడియట్, మూడో కూతురు పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. కాగా అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన మృతురాలు నవ్య(17) బాగ్ లింగంపల్లిలోని అంబే ద్కర్ కాలేజీలో ఇంటర్మీడియ ట్ చదువుతుంది. బుధవారం రాత్రి ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లోని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తె లిపారు. అయితే కుటుంబ స భ్యులు మాత్రం అమావాస్య నుండి తమ ఇంటి ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, అగ రు బత్తీలు, పసుపు, కుంకుమ వేసి క్షుద్ర పూజలు చే శారని, అందువల్లే తమ కూతురు మరణించిందని ఆరోపిస్తున్నారు.
వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు,…
కుల్పుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న మైనర్ బాలిక ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మైనర్ బాలిక ఆత్మహత్యకు కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలిక క్షుద్ర పూజల వల్ల మరణించిందా? లేక ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? అనే కోణాల్లో పోలీసులు ముమ్మురంగా దర్యాప్తు చేస్తున్నారు.
భరత్‌నగర్‌లో విషాదఛాయలు……
చదువుతో పాటు తెలివి తేటల్లోనే రాణించి ఎంతో చలాకీగా ఉండే జియాగూడ భరత్‌నగర్‌కు చెందిన రమాదేవి, శ్రీనివాస్ దంపతులు రెండో కూతురు నవ్య బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడటంతో భరత్‌నగర్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి, విషయం తెలుసుకున్న బంధువులు, సహచర వి ద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చి నవ్య మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు.

పదో తరగతిలో నలంద స్కూల్ టాపర్‌గా నిలిచిన నవ్య తమతో ఎంతో చనువుగా, హుషారుగా మాట్లాడేదని మృతురాలి స్నేహితురాళ్లు గుర్తు చేసుకున్నారు. కాలేజీలోనూ బాగా చదువుతూ, ఎప్పుడూ ఎం తో ఉత్సాహంగా ఉండేదంటూ బంధువులు బోరున విలపించారు. బస్తీవాసులతో ఎంతో కలుపుగోలుగా ఉండే నవ్య టిక్ టాక్‌లోనూ చాలా యాక్టివ్ గా ఉండేదని బస్తీవాసులు తెలిపారు. వారం రోజులుగా ఎందుకో కొంత ముభావంగా ఉన్నట్టు కనిపించిందని, అంతలోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News