Monday, January 20, 2025

మైనర్ బాలిక ఆదృశ్యం

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓమైనర్ బాలిక ఆదృశ్యమైన సంఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.బోయిన్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవిమెండల్ అనితదేవి దంపతులు కుటంబ సభ్యులతో బాపూజీనగర్‌లోని నివాసముంటు జీవనం సాగిస్తున్నారు.వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈనెల 8వ తేదిన తల్లి అనితదేవి తన పని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చింది.

అసమయంలో తన 17 సంవత్సరాల కుమార్తె ఇంట్లో కనిపించ లేదు.కాగా తాను పనిచేస్తున్న ఇంటి దగ్గరికి వెళ్లి చూసింది. ఇంటికి తిరిగి వస్తుందిలే అనుకుంది.రాత్రి అయిన ఇంటికి తిరిగి రాకపోవటంతో తన భర్తకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. భార్యభర్తలు ఇద్దరు తెలిసిన వారిని, బంధువుల ఇంటి వద్ద వెతికిన ఫలితం లేకపోవటంతో బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News