Monday, December 23, 2024

కాచిగూడలో బాలిక అదృశ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన బాలిక కన్పించకుండా పోయిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…తిలక్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో బాలిక తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అక్కడే భార్య పిల్లలతో ఉంటున్నాడు. బాలిక రమ్య(15) అంబర్‌పేటలోని పోలీస్ లైన్‌లో ఉన్న జిడ్‌పిఎస్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిద తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం బయటికి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తల్లిదండ్రులు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News