Friday, December 27, 2024

ఆరేళ్ల బాలికపై హత్యాచారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని ఓ రైస్‌మిల్లు ఆవరణ లో తల్లి ఒడిలో నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హ త్య జరిగింది. ఓ కార్మికుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసిన పైశాచిక సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, దహెగాం మండల కేంద్రానికి చెందిన ఓ నిరుపేద కుటుంబం ఉపాధి కోసం వలస వచ్చి రైస్‌మిల్లులో కూలీ పనులు చేసుకుంటోంది. గురువారం రాత్రి ఆరు బయట తల్లి ఒడిలో నిద్రిస్తున్న బాలికను అక్కడి రైస్‌మిల్లులో డైవర్‌గా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన వినోద్ మజిహ (28) అపహరించి అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేశాడు. ని ద్రలేచిన బాలిక తల్లి తన బిడ్డ లేదని తోటి కార్మికులతో లబోదిబోమనడంతో

తోటి కార్మికులు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. బాలిక మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారాన్ని అందించారు. కాగా, క్రూరమృగంలా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులతో పాటు బంధువులు, మండల కేంద్రం నుండి వచ్చిన పలు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నిందితుడి పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతూ పోస్టుమార్టం గది వద్ద బాధితుల పక్షాన వారి బంధువులు, తదితరులు ధర్నా నిర్వహించారు. అనంతరం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సంఘటన స్థలానికి పెద్దపల్లి ఎసిపి జి కృష్ణ, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్ చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News