Thursday, December 26, 2024

మైనర్ బాలికపై అత్యాచారం..చిత్రహింసలు: ఇద్దరు ఆలయ ఉద్యోగుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సత్నా(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన మైహర్ పట్టణంలోగల ఒక ప్రముఖ దేవాలయ మేనేజింగ్ ట్రస్టుకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఒక 12 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీరమంతా కొరికి, ఆమెపై దారుణ హింసాకాండకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

గురువారం నాడు ఆ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఈ ఇద్దరు ఉద్యోగులు ఆమె మర్మాంగంలోకి ఇనుపరాడ్ వంటి వస్తువును గుచ్చారని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే ఈ విషయాన్ని ధ్రువీకరించగలమని సీనియర్ అధికారులు తెలిపారు.

తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆ బాలికను రేవాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందచేస్తున్నారు. నిందితులను రవీంద్ర కుమార్ రవి, అటుల్ భడోలియాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 30 ఏళ్ల వయసున్న ఈ ఇద్దరు నిందితులను భుక్రవారం స్థానిక కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించినట్లు సత్నా ఎస్‌పి అశుతోష్ గుప్తా తెలిపారు.

ఇదిలా ఉండగా..మైహర్‌లోని మా శారదాదేవి మందిర్ మేనేజింగ్ కమిటీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ తమ వద్ద పనిచేస్తున్న రవి, భడోలియా అనే ఇద్దరు ఉద్యోగులపై క్రిమినల్ కేసు నమోదైనందున వారిద్దరినీ తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రకటించింది. వారిద్దరి అసభ్య చర్య ఆలయ ప్రతిష్టను దెబ్బతీసిందని కమిటీ తెలిపింది.

మైనర్ బాలికపై అత్యాచార ఘటన సత్నా పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలోని మైహర్ పట్టణంలో జరిగినట్లు మరో పోలీసు అధికారి తెలిపారు. ఆ మైనర్ బాలికను ప్రలోభానికి గురిచేసిన ఇద్దరు నిందితులు ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News