Friday, December 20, 2024

గుంటూరులో దారుణం.. బాలికపై ఇద్దరు యువకుల లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

Minor girl raped by 2 boys in Guntur

అమరావతి: గుంటూరు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వెంగళాయపాలెంలో ఓ బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికకు ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాలికకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో గుర్తు తెలియన ఓ యువకుడు బాలిక వద్దకు వచ్చి నీ ప్రియుడికి సీరియస్ గా ఉందని లాడ్జీకి తీసుకెళ్లాడు. అక్కడ మరో యువకుడితో కలిసి బాలికపై అత్యాచారాని పాల్పడ్డాడు. సాయంత్రం బాలిక జరిగిన విషయాన్ని ఇంటికెళ్లి తల్లిదండ్రులతో చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Minor girl raped by 2 boys in Guntur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News