Sunday, December 22, 2024

నిజామాబాద్‌లో బాలికపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Minor girl raped in Nizamabad district

 

నిజామాబాద్: నిజామాబాద్‌ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై అత్యాచారం జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు గత నెల 31న భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి ప్రయత్నించింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. 14 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న ఆమె అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. యువకుడు పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని బాలిక పేర్కొంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పొక్సో, అత్యాచారం సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News