Friday, January 10, 2025

కదులుతున్న బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

కదులుతున్న బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. దిక్కుతోచనిస్థితిలో కనిపించిన ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కాపాడింది. ఫిర్యాదు అందుకున్న పోలీస్‌లు బస్సు డ్రైవర్, కండక్టర్‌తోసహా కొందరిని అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఈ సంఘటన జరిగింది. పంజాబ్‌కు చెందిన మైనర్ బాలిక దేశ రాజధాని ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు ఉత్తరాఖండ్ రోడ్‌వేస్ బస్సులో ప్రయాణించింది. ఆగస్ట్ 12,13 మధ్య రాత్రివేళ కదులుతున్న బస్సులో ఆ బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది.

అయితే మానసిక వికలాంగురాలిగా కనిపించిన ఆ బాలిక డెహ్రాడూన్ లోని ఇంటర్‌స్టేట్ బస్ టెర్మినల్ వద్ద దిక్కుతోచని స్థితిలోఉన్నదని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్లుసి) సూపర్‌వైజర్ సరోజిని తెలిపారు. 13 వ తేదీ తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఆ బాలికను గుర్తించి సంక్షేమ కేంద్రానికి తరలించినట్టు చెప్పారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టు తెలుసుకుని పోలీస్‌లకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్, కండక్టర్ సహా కొందరిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News