Monday, January 20, 2025

సామూహిక అత్యాచారం చేసి బావిలో పడేశారు

- Advertisement -
- Advertisement -

మావ్(యుపి): ఘోసి పోలీసు స్టేషన్ పరిధిలోని మావ్ గ్రామంలో శుక్రవారం ఒక 14 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆమె చేతులు, కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వ్యవసాయ బావిలో పడేశారు. బావిలో పడి ఉన్న ఆ బాలికను గమనించిన కొందరు గ్రామస్తులు వెంటనే ఆ బాలికను వెలుపలకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. నిందితులలో ఇద్దరిని అరెస్టు చేశామని, మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు శనివారం తెలిపారు.

బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం& ఉదయం చెత్త పారేయడానికి వెళ్లిన మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాలడ్డారు.. తన ఇంటికి సుమారు 200 మీటర్ల దూరంలోని వయవసాయ బావిలో తన కుమార్తె లభించిందని, ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కాళ్లు కట్టేసి పడేశారని ఆమె తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి తరలించినట్లు అదనపు ఎస్‌పి త్రిభువన్ నాథ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News