Friday, November 15, 2024

మైనర్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేయాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ప్రతి ఊరికి ప్రతి చెరువుకు కాల్వలు, మైనర్ కాల్వల ద్వారా నీళ్లు చేరవేయడమే లక్ష్యంగా పని చేద్దామని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార వర్గాలకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. మైనర్ ఇరిగేషన్ కాల్వ భూసేకరణ తొందరగా చేపట్టి, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను హరీశ్ రావు ఆదేశించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో మల్లన్న, రంగనాయక సాగర్ జలాశయం ద్వారా కాల్వలు, మైనర్ కాల్వల పనుల పురోభివృద్ధి పై స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్డీఓ, ఇరిగేషన్ ఇఇ, డిఇ ఇంజనీరింగ్ అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడారు.

మల్లన్నసాగర్ 1ఆర్ కాలువ ఆయకట్టు 21000 ఎకరాల పనులలో వేగం పెంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మల్లన్న సాగర్ 1ఆర్ పరిధి గల పలు గ్రామాలలో కాలువ పనులు, భూసేకరణ, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ ఎస్ఈ, ఈఈ, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ఫోన్ లైనులో మంత్రి ఆదేశించారు. మల్లన్న సాగర్ 3ఆర్,4ఆర్ కాలువ నిర్మాణంపై చర్చించారు. రంగనాయకసాగర్ ఎల్ఎంసి ఆర్-8 కాలువ వాగు క్రాసింగ్ బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేయాలని, ఏజన్సీ, ఎస్ఇ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రంగనాయకసాగర్ ఎల్ఎంసి ఆర్3, ఆర్ఎం2, ఎల్ఎస్ఎం5 కాలువ పనులు, భూసేకరణ త్వరగా పూర్తి చేసి మైలారం, కమ్మర్లపల్లి, చౌడారం, అల్లీపూర్ కు వెంటనే నీళ్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News