Monday, December 23, 2024

దారుణ ఘటన.. తాంత్రిక పూజలకు తల్లిదండ్రులనే బలిచ్చిన మైనర్

- Advertisement -
- Advertisement -

Minor killed Parents in Chhattisgarh

రాయ్‌పూర్: మంత్రాలు, తాంత్రిక పూజల నెపంతో దారుణాలు జరుగుతున్నాయి. మానసికంగా బాధపడుతున్న సోదరుడికి నయం అవుతుందని ఓ తాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి తల్లిదండ్రులనే అతి కిరాతకంగా ఓ 17 ఏళ్ల బాలుడు చంపేశాడు. దీనికి కొందరు బంధువులు కూడా ఆ బాలుడికి సహకరించారు. ఈ సంఘటనకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. నందిగావూన్ గ్రామంలో ఆగస్టు 1న ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని రాయ్‌గఢ్ ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. మృతులు మహేశ్‌పుర్‌కు చెందిన సుక్రుయాదవ్ (40), మస్కతి యాదవ్ (45)లుగా గుర్తించామని వెల్లడించారు. విచారణలో తన తల్లిదండ్రులను మరో ఏడుగురితో కలిసి తానే హతమార్చానని బాలుడు అంగీకరించాడు. పోలీసుల వివరాల ప్రకారం నెల రోజుల క్రితం నిందితుడి సోదరుడు మానసిక రోగిగా మారడంతో సద్గురు ఆశ్రమానికి చెందిన తాంత్రికుడు మోహన్ యాదవ్ దగ్గరకు తీసుకెళ్లారు. తల్లిదండ్రులు మంత్రాలు చేయడం ద్వారానే అతడు మానసిక రోగిగా మారాడని, వారిని హత్య చేస్తే మామూలు మనిషి అవుతాడని తాంత్రికుడు చెప్పడంతో నిందితుడు ఈ హత్యకు పూనుకున్నాడు. బంధువులు ఏడుగురు సహకరించారు. హత్య చేశాక మృతదేహాలను మహానది లో పడేయాలని ప్రణాళిక వేశాడు. నిందితుడి బావ జులై 30న ఓ వాహనం తీసుకుని భగ్వాన్‌పుర్‌కు వెళ్లి అక్కడ తాడు, టవల్, ప్లాస్టిక్ సింక్ కొన్నాడు. ఆ తర్వాత మీ కొడుకు అనారోగ్యానికి గురయ్యాడని నమ్మించి బాధితులను వాహనంలో ఎక్కించుకున్నారు. సురాజ్‌గఢ్ లోని మహానది వంతెన వద్దకు తీసుకెళ్లి వారి గొంతుకోసి హత్య చేశారు.

Minor killed Parents in Chhattisgarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News