Thursday, January 23, 2025

మైనర్‌పై అత్యాచారం …ఆమె గుడ్లు ప్రైవేట్ ఆసుపత్రులకు విక్రయం

- Advertisement -
- Advertisement -
atrocity
తమిళనాడులో ఘోరంపై…విచారణ ప్రారంభించిన  పోలీసులు

చెన్నై: ఈ ఆధునిక కాలంలో నేరాలు, అత్యాచారాలు విపరీతంగా ఉంటున్నాయి. మనం ఊహించలేని ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడులోని పోలీసులు ఒక మైనర్ బాలికపై ఆమె తల్లి తాలూకు మగ స్నేహితుడు పలు సందర్భాల్లో అత్యాచారం చేశాడని,  ఆ ప్రాంతంలోని అనేక ఆసుపత్రులకు ఆమె ఓసైట్‌లు లేక ఆడ గామేట్ సెల్స్ లేదా గుడ్లను బలవంతంగా అమ్మాడని కనుగొన్నారు. కాగా ఆ బాలిక తల్లి, ఆమె స్నేహితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అరెస్టయిన ఇతరులలో… అమ్మకానికి సహకరించిన మహిళా మధ్యవర్తి,  బాలికను 20 ఏళ్ల వయస్సు గల వ్యక్తిగా గుర్తించడానికి నకిలీ ఆధార్ కార్డును తయారు చేసిన వ్యాన్ డ్రైవర్ కూడా ఉన్నారని కేసును విచారిస్తున్న సీనియర్ అధికారి తెలిపారు. “మేము కొన్ని ఆసుపత్రులు,  కొంతమంది వైద్యులపై కూడా దర్యాప్తు ప్రారంభించాము” అని అధికారి తెలిపారు.

2017 నుండి రాష్ట్రంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు ఆ బాలిక గుడ్లను అక్రమంగా విక్రయించేందుకు ఆమెను ఉపయోగించుకుంటున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ సహాయంతో పోలీసులు గుర్తించారు. ‘‘సమస్యలు వచ్చిన తర్వాత… ఆ అమ్మాయి తన తల్లి, ఆమె మగ స్నేహితుడిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది’’ అని పోలీసు అధికారి తెలిపాడు.

‘‘బాలిక తన కష్టాల విషయంలో చాలా కాలం పాటు మౌనంగా ఉండిపోయింది, అయితే గత నెలలో పరిస్థితులు విపరీతంగా మారడంతో ఆమె తన ఇల్లు విడిచిపెట్టవలసి వచ్చింది” అని అధికారి చెప్పారు. “ఆమె కొన్ని రోజులు సేలంలో ఒక స్నేహితురాలితో ఉండి, కొంతమంది బంధువులను సంప్రదించింది,  తనపై  హింస, గాయం వివరాలను పంచుకుంది. వారు పోలీసులకు సమాచారం అందించారు’’ అని పోలీసు అధికారి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News