Monday, December 23, 2024

చార్మినార్ వద్ద సిఎం కెసిఆర్ చిత్రపటానికి మైనారిటీల పాలాభిషేకం

- Advertisement -
- Advertisement -

పాల్గొన్న మంత్రి మహమూద్ అలీ, కార్పొరేషన్‌ల చైర్మన్లు

హైదరాబాద్ : ముస్లిం మైనారిటీల సంక్షేమాభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి హోం మంత్రి మహమూద్ అలీ, వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్లు, మైనారిటీ ప్రముఖ నేతలు చారిత్రాత్మక చార్మినార్ వద్ద పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 100 శాతం సబ్సిడీ పథకం కింద రాష్ట్రంలోని మైనారిటీలకు లక్ష రూపాయలను అందజేసేందుకు ఉత్త్వులను జారీ చేసిందన్నారు. కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతోందని అన్నారు. ఈ పథకం వల్ల వేలాది మంది ముస్లింలకు లబ్ది చేకూరుతుందన్నారు. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలందరి తరుపున, ముఖ్యంగా ముస్లింల తరపున మహమూద్ అలీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని, నాయకులకు కెసిఆర్ రోల్ మోడల్ అని మంత్రి అన్నారు. తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలో ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, మైనారిటీలు, పేదల అభివృద్ధి, సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని అన్నారు, వారి సంక్షేమానికి నిరంతరం చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మైనారిటీ పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, ముఖ్యంగా మైనార్టీల కోసం ప్రారంభించిన పథకాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, స్కాలర్ షిప్‌లు, షాదీముబారక్, ఉచిత తాగునీరు, ప్రామాణిక విద్యుత్, రైతు బంధు, దళితుల పథకాలను ఈ సందర్బంగా మంత్రి ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాక్టికల్, సెక్యులర్ లీడర్ అని హోంమంత్రి అన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కెసిఆర్ జాతీయ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించబోతున్నారని మహమూద్ అలీ చెప్పారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ మసిఉల్లా ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మోహమ్మద్ ఇంతియాజ్ ఇసాఖ్, నాయకులు రహీముల్లాఖాన్ నియాజీ, అక్బర్ హుస్సేన్, సలాఉద్దీన్, బద్రుద్దీన్, మొహమ్మద్ షబ్బీర్ అహ్మద్, ఆరీఫుద్దీన్, అబ్దుల్ బాసిత్, నవాబ్ మీర్ అర్షద్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.

KCR Palabhishekham

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News