Thursday, January 23, 2025

మైనారిటీ బంధు

- Advertisement -
- Advertisement -
సంపూర్ణ సబ్సిడీతో రూ.లక్ష సాయం.. జిఓ జారీ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని బిసిలకు అందిస్తున్న మైనారిటీలకూ రూ. లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నాడు ఉత్తర్వు లు జారీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్ర భుత్వం పనిచేస్తున్నదని అన్నారు. ఇందులో భా గంగా ఇప్పటికే అన్నివర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందన్నారు. మైనారిటీల సంక్షేమాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంద ని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. విద్య, ఉపా ధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనారిటీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతుందన్నారు. దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్పలితాలను అందిస్తున్నదని ముఖ్యమంత్రి అన్నారు. సంస్కృతుల ను, విభిన్న మత, ఆచార సాంప్రదాయాలను స మానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా త హజీబ్‌ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉం టుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన క్రిస్టియన్లకు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, అర్హులైన ముస్లిం, సిక్కు, బుద్దిస్ట్, జైన్, పార్శీ మతాలకు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ లక్షరూపాయల ఉచిత సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి చేపట్టిన కార్యాచరణ, అమలు చేస్తున్న పథకాలు మరే రాష్ట్రంలో అమలు కావడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మైనారిటీల విద్యా వికాసానికి, వారి సామాజిక, ఆర్థిక ప్రగతికి దోహదం చేసే అనేక పథకాలు, కార్యక్రమాలను చేపట్టి సంఘంలో ఆత్మ గౌరవం, హోదా కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే కార్యాచరణను ప్రభుత్వం అమలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సర్వధర్మ సమ భావనను పాటిస్తూ, ఏ సామాజిక వర్గం పట్ల వివక్ష, విస్మరణ లేకుండా ప్రగతి ఫలాలను అందరికీ అందజేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి ఏడాదికి రూ. 300 కోట్లు కూడా ఖర్చు చేసేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 జూన్ నుంచి 2023 జనవరి వరకు ప్రభుత్వం రూ. 8,581 కోట్లను మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,286 కోట్లు ఖర్చు చేయడం మైనార్టీ వర్గాల అభ్యున్నతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
పరిగణలోకి పెండింగ్ దరఖాస్తులు
202223 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సహాకార పథకం కింద సబ్సిడీ రుణాలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ దరఖాస్తులను స్వీకరించింది. ఆ దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. 202324 ఆర్థిక సంవత్సరం లో 100% సబ్సిడీ కింద రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి పెండింగ్ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. క్రైస్త వ లబ్ధిదారులను ఎంపిక చేయడానికి క్రిస్టియన్ మైనారి టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన క్రైస్తవుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ గ్రాంటును అందజేయడం జరుగుతుంది. దరఖాస్తు దారుడు 21 ఏళ్ళ నుండి 55 ఏళ్ళ మధ్య వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తు దారుని వార్షికాదాయం పట్టణాలలో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.5 లక్షలకు మించి ఉండరాదు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్తాయి మానిటరింగ్ కమిటి / జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమ్ సెలక్షన్ కమిటి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. పూర్తి చేసిన లబ్దిదారుల జాబితాను జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదం తీసుకోవడం ద్వారా తుది జాబితాను సిద్దం చేస్తారు. సెలక్షన్ లీస్ట్ (దశలవారిగా) తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వెబ్‌సైట్ నందు పొందు పరుచడం జరుగుతుంది. సబ్సిడీని వన్‌టైమ్ గ్రాంట్‌గా విడుదల చేయడం జరుగుతుంది. దీని ప్రకారం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండిలు చర్యలు తీసుకుంటారని ఉత్తర్వులో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News