Sunday, December 22, 2024

బాధితుల ఫిర్యాదులపై మైనారిటీ కమిషన్ విచారణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ అధ్యక్షతన సమావేశమై బాధితుల పిర్యాదులపై విచారణ జరిపింది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రతినిధిగా రిజిస్ట్రార్ , ప్రభుత్వ కార్యదర్శి, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రతివాదులుగా విచారణ జరిగింది. ఉస్మానియా యూనివర్శిటీ భాషాశాస్త్ర ప్రొఫెసర్, ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ విషయంలో, మునుపటి రాష్ట్ర మైనారిటీల కమిషన్ రెగ్యులర్ పెన్షన్ స్కీమ్, పే రివిజన్ కమిషన్ ప్రకారం వేతన స్థిరీకరణ కోసం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: వాష్ రూమ్‌లో విద్యార్థినిపై వీడియో చిత్రీకరణ … కుష్బూ సమగ్ర దర్యాప్తు

ప్రతివాది ఉస్మానియా విశ్వవిద్యాలయం తరపున రిజిస్ట్రార్ స్వయంగా హాజరై మహమ్మద్ అన్సారీని సాధారణ పెన్షన్ స్కీమ్‌కి పరిగణించడానికి, మునుపటి వేతన సవరణ ప్రకారం వేతనాన్ని నిర్ణయించిన తర్వాత సవరించిన జీతం చెల్లించడానికి అంగీకరించారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత నెల లేదా రెండు నెలల్లో విశ్వవిద్యాలయం ఉత్తర్వులను జారీ చేస్తుందన్నారు. దారతుల్ మారిఫ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ మెహజబీన్ అక్తర్ విషయంలో క్రిమినల్ కేసు ఉందని అది పోలీసుల విచారణలో ఉందని తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి, పిటిషనర్ అవసరమైన మెటీరియల్ పేపర్లను రిజిస్ట్రార్‌కు అందించారు. కేసు ఉపసంహరణను త్వరలో పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 1 ఆగస్టు 2022 నుండి జీతం చెల్లించని దైరతుల్ మారిఫ్‌లోని ఐదుగురు ఉద్యోగుల విషయంలో బడ్జెట్ విడుదలైన వెంటనే దైరతుల్ మారిఫ్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని, వారిని సర్వీసులో కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. పైన పేర్కొన్నవి చాలా కాలం నుండి పెండింగ్‌లో ఉన్న విస్తృతమైన విచారణల తర్వాత కమిషన్ ఈ కేసులను పరిష్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News