Wednesday, January 22, 2025

బిజెపిలో చేరిన మైనార్టీ నాయకులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపి మారిందని ఆ పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పెద్ద సంఖ్యలో మైనార్టీ నాయకులు పార్టీలో చేరారరు. ఈ సందర్భంగా అఫ్సర పాషా మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వానికి, కేంద్ర ప్రభుత్వ పథకాలకు మైనార్టీలు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు.

పార్టీలో చేరిన సమీ మొహమ్మద్ ఖాన్, రిదా కుదూస్, సయ్యద్ ఫరహాన్, మొహమ్మద్ మీరాజ్, సయ్యద్ కలిముద్దీన్, ఫారూఖ్ అహ్మద్ బట్, శ్రీధర్ రావు,మక్సుత్‌లను కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ముజీబ్, రాష్ట్ర కార్యదర్శి సైఫుల్ల ఖాన్, అలీ గుట్ మీ, మహమ్మద్ పాషా, శంషుద్దీన్, తౌసిఫ్ అబ్బాస్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News