Wednesday, January 8, 2025

సారీ సమంత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేయడం వల్ల భావోద్వేగంతో తాను ఒక కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని అటవీ పర్యావరణ దేవాదాయ శా ఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు గురువారం ఉ దయం హన్మకొండ జిల్లా కేంద్రం రామ్‌నగర్‌లోని తన నివాసం వద్ద విలేకరులతో మంత్రి సురేఖ మా ట్లాడారు. కేటీఆర్ గతంలో వ్యవహరించిన తీరు మహిళలను చులకనగా చూసిన విధానం, ఆయన క్యారెక్టర్ గురించి విమర్శలు చేయాల్సి వచ్చింది అన్నారు. ఆ సందర్భంలో తనకు ఇంకెవరి పైన ద్వేషం గానీ, కోపంగాని లేవన్నారు. అనుకోని సం దర్భంలో ఆ కుటుంబం గురించి మాట్లాడవలసి రావడం అనుకోకుండా తన నోటి నుంచి వచ్చినందున దానికి తాను బాధపడుతూ తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం రాత్రి ఆ కుటుంబం ట్వీట్ చేసిన తర్వాత తాను చాలా బాధపడినట్లు చెప్పారు.

ఆ మేరకే తన వ్యా ఖ్యలను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. తాను ఏ విషయంలోనైతే బాధపడుతున్నానో ఆ విషయంలోనే తాను ఇంకొకరిని నోప్పించానని తెలిసి వెంటనే తన వ్యాఖ్యలను వెనకకు తీసుకుంటున్న ట్లు తిరిగి ట్వీట్ చేసినట్లు చెప్పారు. మహిళగా, మంత్రిగా తనకు జరిగిన అవమానం బాధ ఇంకొకరికి జరగకూడదని, ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తున్న ట్లు చెప్పారు. కేటీఆర్ విషయంలో తగ్గేది లేదన్నా రు. దొరహంకారం తగ్గి తనకు క్షమాపణ చెప్పే వరకు మహిళగా తన పోరాటం కొనసాగుతుందన్నారు. కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పకుండా తనకే క్షమాపణ చెప్పాలనడం దొంగే దొంగ అన్నట్లు ఉందన్నారు. కేటీఆర్ విషయంలో ఏం మాత్రం వెనుక్కి తగ్గేది లేదన్నారు. కేటీఆర్ ఐ టీ మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్నందున అతని పార్టీకి సంబంధించిన కార్యకర్తలను సోషల్ మీడియాలో దుబాయ్ నుండి ట్రోల్ చేస్తున్నారని దాని కనిపెట్టి వారిని కట్టడి చేసే పరిస్థితి ఆయనది కాదా అని మంత్రి ప్రశ్నించారు. దొంగ లెక్క సో షల్ మీడియాలో ట్రోల్ చేయిస్తూ మమ్మల్ని అవమానించింత కాలం కేటీఆర్‌ను వెంటాడుతూనే ఉంటామని ఆమె హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News