Tuesday, February 11, 2025

పెన్నీల తయారీ ఆపేయాలని ట్రంప్ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా కరెన్సీలో అతితక్కువ విలువున్న పెన్నీ (సెంట్స్)లను కొత్తగా తయారు చేయడాన్ని నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. ఒక నాణెం మింటింగ్‌కు రెండు పెన్నీల ఖర్చు వస్తోందని, ఇదంతా వృధా వ్యవహారంగా అభివర్ణించారు. ఈమేరకు ఆయన ట్రూత్‌సోషల్‌లో పోస్టు చేశారు. పెన్నీల తయారీ నిలిపివేయాలని ట్రెజరీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశా. మనగొప్ప దేశ బడ్జెట్ నుంచి వృధాను తొలగించండి. అది పెన్నీ అయినా సరే’ అని ఆ పోస్టులో వెల్లడించారు. న్యూఆర్లిన్స్‌లో సూపర్‌బౌల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ఆయన స్వయంగా వెళ్లి వీక్షించారు. ఈ ప్రయాణం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ , మస్క్ నేతృత్వం లోని డోజ్ ఇప్పటికే ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో పలు లోపాలను గుర్తించినట్టు వెల్లడించారు. వీటిని గమనించడం లేదని, లేకపోతే అమెరికాపై ఇప్పటికంటే తక్కువ భారం ఉండేదని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News