మలయాళ నటుడు, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ముకేశ్‌పై రేప్ కేసు నమోదైంది. మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నటి మిను మునీర్ కొచ్చిలోని మరదు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నటులు ముఖేష్ ఎం, జయసూర్య, మణియంపిళ్ల రాజు, ఇడవెల బాబుతో కలిసి సినిమాల్లో పనిచేసిన సమయంలో శారీరకంగా, అసభ్యకర మాటలతో వేధించారని మునీర్ ఆరోపించారు.
మలయాళ చిత్ర పరిశ్రమను విడిచిపెట్టి చెన్నైకి వెళ్లడానికి వేధింపులే కారణమని నటి మిను మునీర్ చెప్పారు. నటి ఫిర్యాదుతో ముఖేష్ పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. అయితే మునీర్ తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాని, రాజకీయంగా నన్ను దెబ్బ తీసేందుకు నాపై తప్పుడు ఆరోపలు చేసున్నారని ముఖేష్ అన్నారు.
కాగా, మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల లైంగిక వేదింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ నియమించింది. దర్యాప్తు చేసి ప్రభుత్వానికి హేమ కమిటీ నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది.